PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘చెన్నూరు’ స్టేషన్ .. ఎర్రగుంట్ల రూరల్ సర్కిల్​ పరిధిలోకి…

1 min read

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు  ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చెన్నూరు పోలీస్ స్టేషన్ ఇకమీదట ఎర్రగుంట్ల రూరల్ సర్కిల్ లోనికి చేర్చడం జరిగిందని ఎర్రగుంట్ల (కమలాపురం) రూరల్ సీఐ ఎన్, రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు, శుక్రవారం ఆయన చెన్నూరు పోలీస్ స్టేషన్ సందర్శించారు,  ఎస్సై శ్రీనివాసులురెడ్డి తో కేసుల విషయమై చర్చించారు, అనంతరం విలేకరుల తో మాట్లాడుతూ కమలాపురం నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు , వి ఎన్ పల్లె, కమలాపురం పోలీస్ స్టేషన్ల ను ఎర్రగుంట్ల( కమలాపురం) రూరల్ సర్కిల్ పరిధిలో కి తీసుకోవడం జరిగిందన్నారు, ఇకమీదట క మలాపురం నియోజకవర్గ పరిధిలో ఇద్దరు సిఐలు, ఆరు మంది ఎస్ఐలు ఉంటారని తెలిపారు, చెన్నూర్ లో కులమతాలకు అతీతంగా అందరు సఖ్యతగా నడుచుకోవాలని ఆయన తెలిపారు, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు, జూదం, మట్కా,  గ్యాంబ్లింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా, వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలియజేశారు, అదేవిధంగా పెన్నా నది పరిధిలో అక్రమ ఇసుక రవాణా చేపట్టి చర్యలు తప్పవని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాసులు రెడ్డి,  పాల్గొన్నారు.

About Author