PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జొమాటో ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త‌.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వెంచర్ క్యాపిటల్ సంస్థ మూరే స్ట్రాటజిక్ వెంచర్స్ ఏకంగా 4.25 కోట్ల జొమాటో షేర్లు విక్రయించింది. ప్రీ-ఐపీవో ఇన్వెస్టర్ అయిన మూరే కొంతనష్టానికే షేర్లును అమ్మింది. ఒక్కో జొమాటో షేరును రూ.44 వద్ద అమ్మినట్టు బ్లాక్ డీల్ డేటా చెబుతోంది. ఈ డీల్ విలువ రూ.187 కోట్లుగా ఉందని డేటా స్పష్టం చేసింది. ఐపీవోకు ముందు రూ.191 కోట్లతో ఈ వాటాను దక్కించుకుంది. దీంతో మూరే సంస్థకు మొత్తం రూ.4 కోట్ల నష్టం వాటిల్లింది. అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా మూరే వెంచర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జనవరి 2021లో నెగ్సస్ వెంచర్స్ నుంచి కన్వర్టబుల్ జీ-సిరీస్ షేర్లను రూ.191 కోట్ల విలువతో కొనుగోలు చేసింది. కాగా గతేడాది జులైలో జొమాటో స్టాక్ మార్కెట్లపై ఒక్కో షేరు రూ.126 వద్ద లిస్టింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

                                                    

About Author