స్టార్ హీరోకు తుపాకీ లైసెన్స్ జారీ.. ఎందుకంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు తుపాకీ లైసెన్సు మంజూరు చేస్తూ ముంబయి పోలీసులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ను చంపేస్తామని గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన నేపథ్యంలో అతనికి తుపాకీ లైసెన్సును మంజూరు చేస్తూ ముంబయి పోలీసు కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్ ఖాన్ కు పడుతుందని బిష్ణోయ్ బెదిరిస్తూ రాసిన లేఖను సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్ కు చేర్చారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో సల్మాన్ తనకు తుపాకీ లైసెన్సు జారీ చేయాలని పెట్టిన వినతి లేఖకు ముంబయి జోనల్ డీసీపీ సిఫారసు చేశారు.