దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం
1 min readపల్లెవెలుగు వెబ్: కడప జిల్లా చెన్నూరు కొత్త గాంధీనగర్ కు చెందిన పుటిక జయరాముడు సోమవారం మృతిచెందడంతో ఈ సమాచారాన్ని వైస్సార్సీపీ నాయకులు , మూడవ సెగ్మెంట్ ఎం పి టి సి పైడి కాలువ చంద్రశేఖర్, ఇల్లూరి వెంకట రమణ ,లు వైఎస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకోనిపోవడం జరిగింది, ఆయన వెంటనే స్పందించి ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ కమలాపురం శాసనసభ్యులు పి, రవీంద్ర నాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అయిన పోచమ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతుని కుటుంబ సభ్యులకు శనివారం సాయంత్రం, 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పుటిక ప్రసన్న కుమార్, వై ఎస్ ఆర్ సి పి నాయకులు, కార్యకర్తలు ,స్థానికులు , తదితరులు పాల్గొన్నారు.