PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ఎరువుల కొర‌త‌కు `పెద్ద‌లే` కార‌ణం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో ప్రభుత్వ పెద్దలే ఎరువులు, డీఏపీ కొరత సృష్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. ఎరువులను, డీఏపీని ఆదాయపు వనరుగా మార్చుకునేందుకు పంపిణీ విధానాన్ని మార్చివేశారని, సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయాల్సిన ఎరువులను వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు తరలించిందని తెలిపారు. ఈ మేరకు లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లకు లేఖలు రాశారు. రాష్ట్రంలో సహకార సంఘాలకు కోత విధించి, రైతు భరోసా కేంద్రాలకు మళ్లించామని చెబుతున్నారని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2.25 లక్షల టన్నుల డీఏపీని కేటాయించినా ప్రయోజనం లేకుండా పోయిందని, బ్లాక్ మార్కెటింగ్, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో కృత్రిమ కొరత ఏర్పడిందని నారా లోకేశ్ పేర్కొన్నారు. తద్వారా ఓపెన్ మార్కెట్లో 50 కిలోల డీఏపీ బస్తాకు అదనంగా రూ.300 చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.

                                    

About Author