పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చిన తాలిబన్లు
1 min readపల్లెవెలుగువెబ్ : మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్ ఎ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ తమ దేశంలో లేడని ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్లు ప్రకటించారు. తాలిబన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ మాట్లాడుతూ జైష్ ఎ మహ్మద్ ఉనికి ఆఫ్ఘన్లో లేదని, మసూద్ అజహర్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ భూమిని ఇతర దేశాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇవ్వబోమని కూడా స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలు చేయవద్దని కూడా పాకిస్థాన్‌ను హెచ్చరించారు.