ఆక్సిజన్ అందక 24 మంది మృతి
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆస్పత్రుల్లో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. ఆక్సిజన్ కొరత దేశంలో ఆస్పత్రులను వేధిస్తోంది. కర్నాటకలోని చామరాజనగర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది మృతి చెందారు. ఈ ఘటన మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వెంటిలేటర్ మీద ఉన్న వారికి ఆక్సిజన్ సకాలంలో అందకపోతే వారి పరిస్థితి కూడ ప్రమాదకరంగా మారుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ అవసరం పెరిగిపోతోంది. దీంతో ఆస్పత్రుల్లో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడింది.