వాట్సాప్ ద్వార ట్రైన్ టికెట్లు !
1 min readపల్లెవెలుగువెబ్: హైదరాబాద్ మెట్రో వాట్సాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం తీసుకొచ్చారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ వాట్సాప్ కామన్ కావడంతో టికెట్లు కోసం ఇకపై క్యూలో నిల్చునే బాధ తప్పినట్టే. దేశంలోనే తొలిసారి తాము ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. ఈ మేరకు బిల్ ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయాణికులు తొలుత 83411 46468 నంబరుకు వాట్సాప్‌లో హాయ్ చెప్పాలి. ఆ వెంటనే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసిన తర్వాత మనం వెళ్లాల్సిన చోటును ఎంటర్ చేయాలి. అనంతరం టికెట్ రుసుమును చెల్లించిన వెంటనే క్యూఆర్ కోడ్‌తో కూడిన ఇ-టికెట్ వస్తుంది. అలాగే, మెట్రో స్టేషన్ల వద్ద ఉండే క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్ ద్వారా స్కాన్ చేసి కూడా టికెట్లు కొనుగోలు చేయొచ్చని అధికారులు తెలిపారు.