కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
1 min readపల్లెవెలుగువెబ్ : రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతులకు ఎంపికయ్యారు. కరోలిన్ ఆర్ బెర్టోజీ, మార్టిన్ మెల్డల్. బ్యారీ షార్ప్లెస్ లు ఈ ఏడాది కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీలో విశేష పరిశోధనలు చేసినందుకు గానూ వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం వెల్లడించింది. షార్ప్లెస్, మెల్డల్లు తొలుత క్లిక్ కెమిస్ట్రీకి జీవం పోయగా… బెర్టోజిల్ దానిని దైనందిన జీవితంలో వినియోగపడేలా అభివృద్ధి చేశారు.