సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీఓకు వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న కాటికాపరుల బేగరేల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఓబులేసు మరియు లింగస్వామి ఆధ్వర్యంలో మిడుతూరు ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.రంగమ్మ మాట్లాడుతూ కాటికాపర్ల బేగరీల సమస్యలను పరిష్కరించాలని వారికి గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలని మూడు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని రెండు ఎకరాల వారి ఆత్మగౌరవం కోసం రెండు ఎకరాల భూమి ఇవ్వాలి వయసుతో పరిమితం లేకుండా పెన్షన్లు ఇవ్వాలి.ఈడిమాండ్లు వెంటనే అధికారులు నిర్వర్తించాలని ఎంపీడీవోను కోరారు.మండల అధ్యక్షుడు కాటికాపర్ల సంఘం టిఆనంద్ అధ్యక్షులు దాసు,లక్ష్మీదేవి కమిటీ మెంబర్ శిఖామణి,దేవనూరు దేవన,చిన్న చెన్నయ్య,జయమ్మ,దావీదు,జయమ్మ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఎంపీడీవో స్పందించి కలెక్టర్ కు మీసమస్యలను పంపిస్తామన్నారు.