జనరంజక సీఎంకు ఏపీజేఎఫ్ అభినందన
1 min readఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వీర్ల శ్రీరామ్ యాదవ్
పల్లెవెలుగు వెబ్, విజయవాడ : కరోన కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందలు తెలిపింది ఏపీజేఎఫ్ నగర కమిటీ. గురువారం ఏపీ జర్నలిస్టుల ఫోరం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక లెనిన్ సెంటర్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యానర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్లోని ఏఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వీర్ల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచిన విలేకరుల క్షేమం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని కోరారు. అలాగే కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేయాలని, 2021 మీడియా అక్రిడిటేషన్ మంజూరు చేయాలని, కోవిడ్‌తో ఆస్పత్రి, హోం క్వారంటైన్లో ఉన్న పాత్రికేయులకు రూ. లక్ష తక్షణ సాయం, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన రు 50 లక్షలు భీమా రాష్ట్రంలో విలేకరులకు కూడా వర్తింపజేయాలని శ్రీరామ్ యాదవ్ కోరారు . ఏపీజేఎఫ్ నగర అధ్యక్షుడు యేమినేని వెంకట రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్, సంయుక్త కార్యదర్శిలు పొన్నపల్లి వీరభద్రాచారి (బాబ్జి),జిర్రా కోటేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శిలు యరజర్ల మురళి శంకర్, పోతిన శ్రీనివాసరావు(వాసు),బి మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.