PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన జుబేర్ (25) అనే యువకుడు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి, జుబేర్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి వివాహం చేసేందుకు అమ్మాయి కుటుంబీకులు నిరాకరించారు. దీంతో పాటు జుబేర్ తల్లిదండ్రులు మందలించడంతో కలత చెందిన అతను మనస్థాపానికి గురై సమీపంలోని మసీదు వద్ద గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

About Author