PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రేడ్​ లైసెన్స్​ వసూలు చేయండి..

1 min read

నగర మేయర్​ కె. సురేష్​ బాబు..

పల్లెవెలుగు వెబ్​, కడప: నగరంలో వివిధ దుకాణాల నుంచి పెండింగ్​లో ఉన్న ట్రేడ్​ లైసెన్స్​ వసూలు చేయాలని కడప నగర మేయర్​ కె. సురేష్​ బాబు శానిటేషన్​ సెక్రటరిలను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్​ సురేష్​ బాబు మాట్లాడుతూ నగరంలో రూ.3 కోట్లు వసూలు కావాల్సి ఉందని, దుకాణాల యాజమాన్యాల దగ్గర వసూలు చేయాల్సిందేనని ఆదేశించారు. సమావేశం నందు కడప నగరపాలక సంస్థ కమీషనర్ లవన్న , సూపరింటెండెంట్, ఇంజనీర్ , ఎక్సికుటివ్ ఇంజనీర్ , హెల్త్ ఆఫీసర్ , కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

About Author