చెన్నూరులో కోవిడ్ ట్రాన్సిట్ హాస్పిటల్ ప్రారంభం
1 min readపల్లెవెలుగువెబ్, చెన్నూరు: కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వలక్ష్యమని డిప్యూటీ సీఎంఅంజాద్ బాష అన్నారు. గురువారం చెన్నూరు మండలంలోని హాజ్ హౌస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ ట్రాన్సిట్ హాస్పిటల్ డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 1.20 కోట్లతో దాతల సహకారంతో పోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 పడకల ట్రాన్సిట్ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సి.హరికిరణ్, కడప మేయర్ సురేష్ బాబు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి , జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.