పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతాం ..
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. దీని మీద ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. కరోన ఉధృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ పరీక్షలు వద్దని కోరలేదని చెప్పారు. రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు.