ప్రతి జిల్లాలో ఆనందయ్య మందు పంపణీ
1 min read

పల్లెవెలుగు వెబ్: ప్రతి జిల్లాలో తాను తయారు చేసిన మందు పంపిణీ చేస్తామని కృష్ణపట్నం ఆనందయ్య తెలిపారు. తొలి విడతగా 5వేల మందికి పంపిణీ చేస్తామని ప్రకటించారు. సోమవారం మూడు రకాల మందు ఉన్న కిట్ ను జిల్లా కేంద్రాలకు పంపిస్తామని ఆయన తెలిపారు. తాను తయారు చేసిన కరోన మందుకు ఔషధ చక్రం అని పేరు పెట్టినట్టు ఆయన తెలిపారు. కృష్ణపట్నం శివారులోని తన భూమిలో మందు పంపిణీ చేసేందుకు అవసరమైన కుటీర నిర్మాణానికి భూమి పూజ చేశారు.

