PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాబోయే ఎన్నికల్లో బిజెపికి కచ్చితంగా గుణపాఠం చెప్పాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు  ఆదేశాలు ప్రకారము మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ సుధాకర్ బాబు   ఆదేశాల ప్రకారము ఈరోజు మన జాతీయ నాయకుడు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ  పై బిజెపి ప్రభుత్వం నిన్న రావణ అనే పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అందువల్లనే హొళగుంద మండలం ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమానుల్లా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేదవాళ్ళకి సహాయం చేయకుండా అతి పెద్ద ధనవంతులైన ఆదానీ అంబానీ వారి కోసం పనిచేస్తుందని చెప్పడం జరిగింది అదే కాకుండా బిజెపి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 9:30 సంవత్సరాలు అయింది పేదవాళ్ల కోసం చేసింది శూన్యం బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 నోటు వెయ్యి రూపాయల నోటు రద్దుచేసి నల్లధనాన్ని తీసి పేదవాళ్లకు జీరో అకౌంట్ ఉన్న వాళ్ళకి 15 లక్షలు ఇస్తారని చెప్పి మోసం చేసిన బిజెపి ప్రభుత్వానికి అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన పార్టీ తగిన గుణపాఠం చెప్పాలని రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు అభిమానులకు కోరడమైనది. 2024లో కచ్చితంగా భారతదేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత రైతుల కోసం రైతు రుణాలు మాఫీ మరియు ఒక ఎకరానికి 15000 రైతు భరోసా కింద మరియు కౌలు రైతులకు ఎకరానికి 12000 రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది అని రాహుల్ గాంధీ  చెప్పడం జరిగింది. ఇదే కాకుండా అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా పై మొదటి సంతకం చేస్తారని రాహుల్ గాంధీ  చెప్పడం అయినది. రాహుల్ గాంధీ  ఇది ఆంధ్రప్రదేశ్ ఐదు కోటి జనాభా హక్కు భిక్ష కాదు అని చెప్పడం జరిగింది . ఇదే కాకుండా వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ ఇస్తారని. ఇదే కాకుండా నిరుపేదలకు 6000 ఆర్థిక సహాయం చేస్తారని నెలకు చెప్పడం జరిగింది. మరియు 500 కి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అని రాహుల్ గాంధీ  చెప్పడం జరిగింది కావున కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో అధికారం రావడానికి అందరూ కృషి చేయాలని మిమ్మల్ని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.

About Author