PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ  జగనే సీఎం కావాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు రవియాదవ్ పేర్కొన్నారు . బుధవారం మండలం లోని కొణిదెల గ్రామం 2వ  సచివాలయంలో ఏపీ వై నీడ్  జగన్ అనే కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఎంపీటీసీ సురేష్ , గోగుల శేషు , అయ్యన్న ల  ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చారన్నారని తెలిపారు.పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాలన్న దృఢ సంకల్పంతో జగనన్న  రాష్ట్రంలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించి గ్రామాల్లో సచివాలయాలు,వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారని చెప్పారు.ప్రజల సంక్షేమాన్ని కోరుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తున్న ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. అభివృద్ధి పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో గ్రామ సచివాలయం,వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి పారదర్శక  పాలనను అందిస్తున్నారన్నారని అన్నారు.2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు  డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేసిందని చివర్లో  పసుపు కుంకుమ కింద డబ్బులు పంచి జనాల మోసం చేయాలనుకుందని చెప్పారు.  జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2019 వరకు ఉన్న డ్వాక్రా రుణాల మొత్తాన్ని దశలు వారీగా మాఫీ చేస్తూ వస్తున్నారని చెప్పారు.ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తి జగన్ ఒక్కరేనన్నారు. అర్హులైన పేదలందరికీ కార్పొరేట్ విద్య, వైద్యం అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కే  దక్కుతుందన్నారు. టిడిపి హయాంలో ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారని కానీ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అయిన వాలంటీర్లను,సచివాలయ ఉద్యోగులను నియమించి ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు నూతన చరిత్రకు  శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమానికి ముందుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. అదేవిధంగా కార్యక్రమానంతరం పార్టీ జెండా ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో  వైసీపీ నాయకులు పబ్బతి రవి , నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీ కాంత రెడ్డి , కొంగర రాజు , తదితరులు పాల్గొన్నారు.

About Author