జగన్ కు తొమ్మిదో లేఖ.. మద్య నిషధం పై ప్రశ్న
1 min readపల్లెవెలుగు వెబ్: సీఎం జగన్ మోహన్ రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు తొమ్మిదో లేఖ రాశారు. ఎన్నిలక ప్రచారంలో ఇచ్చిన సంపూర్ణ మద్యనిషేధ హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. నిషేధం కంటే ప్రోత్సాహం ఎక్కువ ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గతంలో కంటే 16 శాతం మద్యం తాగడం పెరిగిందన్నారు. సంపూర్ణ మద్యనిషేధం చేస్తామంటేనే.. ఎన్నికల్లో మహిళలు జగన్ కు ఓటేశారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.