NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దత్త జయంతి సందర్భంగా శ్రీ తాత  బృందావనంలో ప్రత్యేకమైన పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీశ్రీశ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా  సంస్థాన్ కల్లూరు నందు దత్త జయంతి వేడుకలు 26/12/23/( మంగళవారం) సాక్షాత్తు దత్తసరూపమైన విష్ణు ఈశ్వర బ్రహ్మ కలయిక అవతారమే దత్తాత్రేయుడు ఈ కోవ కు చెందిన వారే శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత  శ్రీ తాతగారు కర్నూలు జిల్లా కల్లూరు గ్రామంలో దాదాపుగా 40 సంవత్సరాలు  గా భక్తులను ఉద్ధరిస్తూ ఆధ్యాత్మిక చింతన వైపు భక్తులను నడిపిస్తూ   వారిలో భక్తిశ్రద్ధలను కలిగిస్తూ ఉన్నారు. ఈరోజు దత్త జయంతి సందర్భంగా శ్రీ తాత  బృందావనంలో ప్రత్యేకమైన పూజలు అర్చనలు అభిషేకాలు  పెద్ద ఎత్తున తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు. భజనలు జరిగాయి శ్రీ తాత  31 వ ఆరాధన మహోత్సవము  జనవరి 16 /2024 (కనుమ)నాడు జరుగును “” శ్రీ తాత   ఆరాధన నూతన  సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము”” దాత  అయిన Y.p. cranes ట్రాన్స్పోర్ట్ అధినేత రవికుమార్  అధ్యక్షతన కార్యక్రమము జరిగినది. మధ్యాహ్నము హారతి అనంతరము పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినది… ఈ కార్యక్రమంలో తాత సంస్థాన్ కమిటీ అధ్యక్షులైన దాసరి రామచంద్రారెడ్డి.  హెచ్ హనుమంత రెడ్డి( ఏపీజీపి బ్యాంక్) శ్రీ కోదండమ్ స్వామి (సాయి సేవకులు)  లలితా పీఠం పీఠాధిపతి మేడ సుబ్రహ్మణ్యం వైపి ట్రాన్స్పోర్ట్ అధినేత రవికుమార్  (బళ్లారి చౌరస్తా) 44వ జాతీయ రహదారి వెల్దుర్తి దగ్గర గల  52 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ  ధర్మకర్త  శ్రీ ఆంజనేయ స్వామి. భీమేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త బొమ్మిరెడ్డిపల్లి లక్ష్మి రెడ్డి  తూముకుంట ప్రతాపరెడ్డి బజరంగ్దళ్. శ్రీ నాగేశ్వరరావు గారు( ఆవోప) కర్నూలు కామదేను గోశాల( కొంగనపాడు) బలిజ శ్రీరాములు. సెట్లం రామారావు  గో సేవకులు శ్రీ మాదం గంగాధర్ భజన మండలి తాత భజన మండలి) తాత భక్తులు  దత్త భక్తులు  హిందూ బంధువులు కల్లూరు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు.

About Author