NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

1 min read

నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు

పొదుపు సంఘాల మహిళలకు ముగ్గుల పోటీలు

కర్నూలు, న్యూస్​ నేడు: సోమవారం యోగాంధ్ర మాసోత్సవంలో  ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు. సోమవారం స్థానిక దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ పాఠశాల మైదానంలో, మెప్మా విభాగం అధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలకు యోగాంధ్ర చైతన్య ముగ్గుల పోటీలు నిర్వహించారు.  ప్రథమ విజేతగా జె.స్వప్న, ద్వితీయ విజేతగా ఎస్.రాజేశ్వరి, తృతీయ విజేతగా జి.భవన గెలుపొందగా, వారికి కమిషనర్ బహుమతులు అందజేశారు. అలాగే పాల్గొన్న వారందరికీ సైతం బహుమతులు అందించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. యోగాంధ్ర మాసోత్సవంలో భాగంగా ప్రజల్లో చైతన్యం‌ కలిగించేందుకు విసృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ జీవితంలో యోగాను ఓ భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, యోగా మాసోత్సవ కార్యక్రమాల్లో జనం పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో టిపిఆర్‌ఓ వెంకటలక్ష్మి, టౌన్ మెప్మా ప్రాజెక్ట్ మిషన్ అధికారి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author