NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ఎమ్మెల్యే

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీని డోన్ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి చేశారు. ఈ తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలోని విభాగాలను పరిశీలించి అక్కడి వాస్తవ పరిస్థితులను స్వయంగా సమీక్షించారు.  ఆసుపత్రిలో సేవల నాణ్యతపై వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే , సెల్ టవర్ సమస్య, అవసరమైన ఆపరేషన్ పరికరాల లభ్యత, వైద్యుల లభ్యత, శుభ్రత వంటి అంశాలపై ప్రాముఖ్యత చూపారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలన్నదే తన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.తనిఖీలో గుర్తించిన లోపాలను సకాలంలో సరిచేయాలని సంబంధిత వైద్యాధికారులకు సూచించిన ఎమ్మెల్యే  అవసరమైన అభివృద్ధి పనులకు ప్రభుత్వ మద్దతు అందించేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.డోన్ ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం తరఫున ఎలాంటి లోటు ఉండకుండా చూస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ ,వైద్య సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author