జిల్లా పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
1 min read

రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి
జడ్పీ నిధులతో 55 లక్షల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరులోని జిల్లాపరిషత్ ఆవరణలో జెడ్పి నిధులు రూ.55 లక్షలతో డ్రైయిన్, తారురోడ్డు నిర్మాణాలకు రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి శంఖుస్ధాపన చేశారు. తొలుత జిల్లా పరిషత్ ఆవరణలోగల జాతీయ నాయకుల విగ్రహాలకు రూ.5 లక్షలతో ఏర్పాటుచేసిన లాడర్స్ ను ఆయన ప్రారంభించారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా:ఎన్.టి.ఆర్. విగ్రహానికి ఏర్పాటు చేసిన లాడర్ ను కూడా ప్రారంభించి ఎన్.టి.ఆర్. విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మహాత్మాగాంధీ,జ్యోతిరావ్ పూలే, డా.బి.ఆర్.అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్, మధర్ థెరీస్సా, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు జాతీయ నాయకుల విగ్రహాల వద్దకు వెళ్లి సత్కరించుకునేందుకు రెయిలింగ్ తో కూడిన మెట్లను ఏర్పాటుచేయడం అభినందనీయమని మంత్రి పార్ధసారధి అన్నారు. కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి), ఆప్కాబ్ చైర్మన్,డిసిసిబి చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, జెడ్పి సిఇఓ ఎం. శ్రీహరి,ఎస్సీఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, పలువురు జెడ్పిటిసిలు,స్ధానిక ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.


