NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వంలో సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్ళు

1 min read

మంజూరైన పనులు నాణ్యత ప్రమాణాలతో  పూర్తి చేసి ప్రజలకు వాడుకలోకి  తీసుకురావాలి

జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ

సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఉభయ జిల్లాలు అధికారులు కలిసికట్టుగా పనిచేసి ఏలూరు జిల్లాను అగ్రగామిగా నిలపాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఛాంబరులో గురువారం జిల్లా పరిషత్తు సిఇవో, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, జిల్లా జడ్పీటిసి సభ్యులతో ఉభయజిల్లాల జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన 1 నుండి 7 వ స్థాయీసంఘ సమావేశాలు ఉభయజిల్లాలో మండలాల వారీగా మంజూరైన పనులు, ప్రగతి,పెండింగు పనులు,ఉన్న సమస్యలుపై  సుదీర్ఘంగా సమీక్షంచారు.గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు, ఈ రోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చూసి, ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చుచున్నారని అన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు అందరి సహకారంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు అమలులో అధికారులు పాత్ర కీలకమైనదని అన్నారు. జిల్లాలో మంజూరైన  పనులు వేగంగా జరుగుచున్నాయని, కొన్ని పనులు పెండింగ్లో ఉన్నవి మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశామని,నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి ప్రజలకు వాడుకలోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లా పరిషత్తు సమావేశాలకు జిల్లా అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని, హాజరు కాకపోతే పనులు ముందుకు సాగవని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని,అప్పుడే పనులు నాణ్యతతో పూర్తి అయ్యి వాడుకలోకి తెస్తే ప్రజలు సంతోషపడతారని అన్నారు. అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు,ముఖ్యమైన కార్యక్రమాలకు  ప్రజా ప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించాలని, శిలాఫలకాల పై ప్రోటోకాల్ ప్రకారం పేర్లు ఉండాలని అన్నారు. ప్రోటోకాల్ సరిగ్గా పాటించని అధికారులను శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి కార్యక్రమాలలో పనులు నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులను,కాంట్రాక్టర్లను బాధ్యులను చేసి,బిల్లులను పెండింగులో పెట్టి తక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. సమావేశంలో  జిల్లా పరిషత్ సిఇవో యం. శ్రీహరి, ఉభయ గోదావరి జిల్లాలు వివిధ శాఖల అధికారులు, జడ్పీటిసి సభ్యులు, జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

About Author