NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తమ సహజ వైద్యుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ

1 min read

విజయవాడ న్యూస్​ నేడు : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ చెన్నై ఆయుష్ విజయ పార్క్ హోటల్లో జరిగిన సదస్సు నందు విజయవాడ నగరానికి చెందిన వైద్యుడు మాకాల సత్యనారాయణ ను ఉత్తమ సహజ వైద్యుడుగా ఎన్నిక చేసి లైన్ రాజేష్ ఎం జోషి డిస్టిక్ ఫస్ట్ గవర్నర్ చేతుల మీదుగా సత్కరించింది. చెన్నై ఆయుష్ క్లబ్ అడ్మిన్స్ట్రేటర్ లైన్ డాక్టర్ ఎం పీ అగత్యార్ మాట్లాడుతూ మందులు వాడకుండా,ఎరిగినవి,తెగినవి మరియు కుళ్ళునివి కాకుండా మిగతా వ్యాధులకు ఒంటిలోని 72,000 శక్తి నాడులు, 108 చక్రాలు, 26 శక్తిదారులు సుమారు 1000 మానవ శక్తి కేంద్రాలు,ఊపిరితిత్తుల సామర్థ్యం పెంపు మరియు ఆరు శక్తి క్షేత్రాలను ఉపయోగించి ప్రాణ శక్తిని పెంచటం,వేడి మరియు చలువ తత్వాలను సమస్థితికి తేవడం, అంతర పంచభూతాలను నాడీ శోధన ద్వారా తెలుసుకొని యోగ,ఆక్యుప్రెషర్,అక్యూపంక్చర్ మరియు మల్టీ తెరపి విధానాలతో రుగ్మతలు తగ్గించడం,సర్జరీలను నివారించడం, అర్దంతర చావులను నివారించడానికి చికిత్స,శిక్షణ,పరిశోధన అభివృద్ధికి యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపకుడుగా,చైర్మన్ గా పనిచేసినందుకు ఈ అవార్డు దక్కిందని తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిట్నెస్ మంత్ర దేశవ్యాప్త ప్రచారానికి కూడా డాక్టర్ మాకాల సత్యనారాయణకు ఈ అవార్డు కు ఎన్నికైనట్లు తెలిపారు.డా.మాకాల సత్యనారాయణ కు అవార్డు వరించినందుకు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

About Author