అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
1 min read

అల్లూరి ఒక మహోన్నత శక్తి
అల్లూరి కి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టరుకె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత స్దానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం అలుపెరగని కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు ధైర్యం, త్యాగనిరతి, నిరాడంబరత తరతరాలకు స్పూర్తిదాయకమన్నారు. త్యాగశీలత,దేశంపట్ల గౌరవం, ఐక్యత,సమగ్రతల స్పూర్తిని ఇటువంటి మహనీయుల నుంచి యువత అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలన్నారు.కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు,జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి ఎన్ ఎస్ కృపావరం,కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, కలెక్టరేట్ వివిధ విభాగాల్లోని సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.


