NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీట్ లో జిల్లా మొదటి ర్యాంక్..మహమ్మద్ సోహెల్

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నీట్ రాష్ట్రస్థాయి ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మిడుతూరు విద్యార్థి మొదటి ర్యాంక్ సాధించాడు.నంద్యాల జిల్లా మిడుతూరు గ్రామానికి చెందిన మహమ్మద్ సోహెల్ నేషనల్ ఎలిజిబిలిటీ మరియు ఎంట్రెన్స్ టెస్ట్-2025 ఆదివారం విడుదలైన రాష్ట్రస్థాయి ఫలితాలలో  ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి ర్యాంకు సాధించిన మహమ్మద్ సోహెల్   మిడుతూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల గ్రామం, వారి తండ్రి కే కమాల్ సాహెబ్ కోడుమూరు కో లోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ గా మరియు తల్లి నసీమున్నీసా నందివర్గం  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం,కర్నూల్ మాంటిస్సోరి పాఠశాల ఉపాధ్యాయుల మరియు హైదరాబాద్ శ్రీ చైతన్య  అధ్యాపకుల మార్గదర్శకంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి ర్యాంకు అదేవిధంగా రాష్ట్రస్థాయిలో 8 వ ర్యాంకు మరియు జాతీయస్థాయిలో 133వ ర్యాంకు 640 మార్కులతో సాధించిననందుకు సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మంచి కార్డియాలజిస్ట్ అయి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని మహమ్మద్ సో హెల్ తెలిపారు.

About Author