NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంపోసియా చేప వ్యాధికారక దోమ లార్వాలను అరికడుతుంది..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు ఎమ్మెల్యే, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ అన్న ఆదేశాలతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్  ఆదేశాల మేరకు  కాంబోసియ చేపను  కర్నూలు నందు 4వ వార్డు 2వ డివిజన్ నందు 6 బావిలలో  వదలడం జరిగింది. కాంపోసియా చేప నిలకడగా ఉన్న నీటి యందు వదలడం వల్ల అక్కడ ఉన్న వ్యాధికారక దోమల లార్వాలను నాచును తినడం వల్ల ప్రకృతి సిద్ధంగా వాటిని శుభ్రం చేయడమే కాకుండా వ్యాధికారక  దోమ లార్వాలను లార్వా దశలోనే అరికడుతుంది. దీని వల్ల వార్డు నందు దోమల సమస్య తాగుతుంది.కావున కేఎంసీ ఎంటమాలజీ  శ్రీ వెంకటేశ్వర్లు, మలేరియా ఇన్స్పెక్టర్ మల్లికార్జున, 4వ వార్డు ఇంచార్జి ఊట్ల రమేశ్ బాబు, డివిజనల్ ఎస్సై శివశంకర్, మరియు వార్డ్  సెక్రటరీ లు  జగదీష్, అమీన వారి సమక్షంలో ఈ చేపలను నాల్గవ వార్డు నందు ఆరు బావులలో వదలడమైనది.

About Author