NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి..

1 min read

నేడు మల్యాలలో నీటిని విడుదల చేయనున్న సీఎం

భారీగా పోలీస్ బందోబస్త్..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: (గురువారం) మధ్యాహ్నం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు.మల్యాల ఎత్తిపోతల పథకం నుండి హంద్రీనీవా (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువకు ముఖ్యమంత్రి నీటిని విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గత రెండు రోజుల నుండి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.మల్యాల మలుపు వద్ద వేదికను ఏర్పాటు చేస్తున్నారు.వేదిక వీఐపీ గ్యాలరీ,ప్రజలకు,ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా వేదిక ఎదురుగా ఏర్పాటు చేశారు.

అధికారులకు సూచనలు ఇచ్చిన కలెక్టర్,ఎస్పీ

సీఎం పర్యటన హెలిపాడ్ ఆగే స్థలం మరియు సమావేశం వేదికను నంద్యాల కలెక్టర్ జి రాజకుమారి మరియు ఎస్పీ అదిరాజ్  సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్,అడిషనల్ ఎస్పీ ఎన్ యుగంధర్ బాబు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్త గురించి కలెక్టర్,ఎస్పీ అధికారులకు సూచనలు ఇచ్చారు.అంతేకాకుండా ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి ఎప్పటికప్పుడు పనులను పరిశీలించారు.

స్థలాన్ని తనిఖీ చేసిన సీఎం సెక్యూరిటీ వింగ్

హెలీప్యాడ్ ఆగే స్థలం మరియు సభ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి సెక్యూరిటీ వింగ్ డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ స్క్వాడ్ తో అధికారులు ఆ స్థలాలను తనిఖీ చేశారు.సా 5:30 కు హెలిప్యాడ్ ట్రైల్ చేశారు.

భారీగా పోలీసు బందోబసస్త్

సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు పోలీస్ అధికారులు భారీగా పోలీసులను బందోబస్తుగా నియమించారు.నంద్యాల ఎస్పీ సారథ్యంలో సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది భారీగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అంతేకాకుండా వివిధ శాఖల అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో డి నాగజ్యోతి,డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author