NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వం కక్షపూరిత చర్యలు తగదు..

1 min read

రాష్ట్ర అధ్యక్షుడు కుడిచేటి కిషోర్ కుమార్

న్యాయ‌స్దానాన్ని ఆశ్రయించిన ఎండియూ ఆప‌రేట‌ర్లు

న్యాయం చేసే వరకు పోరాడుతాం

9260 కుటుంబాలు రోడ్డున పడ్డాయి

ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలను కల్పించాలి

ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర  సంఘం ప్రతినిధులు

 విజయవాడ, న్యూస్​ నేడు:ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో 9260 మంది ఎండియు ఆపరేటర్లను తొలగించిందని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ, అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం ఎండియూ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండియూ ఆపరేటర్లను ఉద్దేశించి రేషన్ మాఫియా జరిగిందని చెప్పడం దారుణం అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 40 ఏల  సుదీర్ఘ అనుభవం కలిగిన నారా చంద్రబాబునాయుడు కూడా మా గురించి తప్పుగా మాట్లాడుతుండడం తమకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ఎండియూ ఆపరేటర్ల పై బురద జల్లుతూ చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 18,500 కుటుంబాలను రోడ్డున పడేసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్నారని తెలిపారు. రేషన్ మాఫియా చేశారంటూ ఎండియు ఆపరేటర్లను తొలగించామని దీనివలన ప్రభుత్వానికి రూ.300 కోట్లు ఆదాయం మిగిలిందని చెప్పడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. యోగాంధ్ర పేరుతో ఒక్కరోజులోనే రూ. 350 కోట్లను మీ ప్రభుత్వం స్వాహా చేసిందని పేర్కొన్నారు.తాము వైసీపీ కార్యకర్తమని జగన్ అనుచరులమని పేర్కొనడం ఎంతవరకు సబబుని ప్రశ్నించారు మా హక్కుతో సాధించుకున్న వాహనాలు అవి అని, వాహనాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని వాటిని తిరిగి మాకే ఇచ్చేమని చెప్పడం ఎంతవరకు న్యాయమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దాదాపు 3 లక్షల మందిని ఉపాధి అవకాశాలు లేకుండా చేసి నిరుద్యోగులుగా రోడ్డున పడేసారని పేర్కొన్నారు. అప్పులు చేసి తామంతా జీవితాలు నెట్టుకొస్తున్నామని ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు.అలాగే ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన రెండు సంవత్సరాల బకాయిలు ఇన్సూరెన్స్ అమౌంట్ , అంగనవాడి మిడ్ డే మీల్స్ బకాయిలు, విజయవాడ వరద బాధితులకు సేవలందించిన ఎండియు ఆపరేటర్స్ కి రావలసిన బకాయిలు, ఇవ్వాలని అలానే ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితుల సహాయార్థం 56 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఎంత సర్వీస్ చేసినా తమకు అన్యాయం జరిగిందని తెలియజేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని త‌మ కేసును  హైకోర్టు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్  వాదించ‌నున్న‌ట్లు తెలిపారు ముఖ్యంగా ఎండియూ ఆపరేటర్స్ పాయింట్స్  90% సబ్సిడీ సంబంధించి  నెల‌కు  3,000 చొప్పున  52 నెలల కాలానికి గాను ఆపరేటర్స్ వ్యక్తిగత సాలరీస్ నుండి కట్ చేయడం జరిగింద‌ని,   సబ్సిడీ అమౌంట్ ను   వెనక్కి ఇవ్వాలని, అలాగే  20 నెలల కాల పరిమితి ఉండగా ప్రభుత్వంలో పది పర్సంటేజ్ వాటాదారులైన ఆపరేటర్స్ ను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించిన కారణంగా ఈ 20 నెలల కాలానికి సంబంధించిన వేతనం అంద‌జేయాల‌ని, , ఆపరేటర్స్ ఇచ్చిన వెహికల్స్ పేపర్స్ లో గూడ్స్ క్యారియర్ నుండి మొబైల్ క్యాంటీన్ గా మార్చడం జరిగింద‌ని, మరల దానిని  గూడ్స్ క్యారియర్ గా మార్చి వెంటనే వారికి క్లియరెన్స్ ఇస్తూ ఫిట్నెస్ ఎటువంటి పెనాల్టీ లేకుండా ప్ర‌భుత్వం చేయాల‌ని కోరుతూ  కేసు వేసిన‌ట్లు వివ‌రాల‌ను మీడియాకు వారు  తెలిపారు. కేసు వేసిన వారిలో  16 జిల్లాలు తిరుపతి, శ్రీకాకుళం, పల్నాడు, కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, బాపట్ల, ఎన్టీఆర్, అనంతపురం, సత్య సాయి, యు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, మన్యం, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, జిల్లాల ప్రతినిధులు ఉన్నార‌ని  తెలియ‌జేశారు. ఈ పత్రిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండియూ ఆపరేటర్స్ ప్రతినిధులు చుండూరు సాంబశివరావు, సతీష్, సుధాకర్ రెడ్డి, వెంకట్ దేవా సహాయం, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

About Author