NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం వెల్లువ..

1 min read

మంత్రులు,ఎమ్మెల్యేలు,డీఐ జీ,కలెక్టర్,ఎస్పీ..

ఎస్పీ సారధ్యంలో భారీ పోలీసు బందోబస్తు..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల హంద్రీనీవా ఎత్తిపోతల పథకం కాలువకు నీటిని విడుదల చేయడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అల్లూరు హెలిపాడ్ వద్ద రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్,నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,డీ ఐజీ కోయ ప్రవీణ్,నంద్యాల కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి,ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా,నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఆళ్లగడ్డ,ఆత్మకూరు,పాణ్యం ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ,బుడ్డా రాజశేఖర్ రెడ్డి,గౌరు చరితా రెడ్డి,మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం,జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్,నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్,మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ ముఖ్యమంత్రికి పూల బొకేలు అందజేస్తూ ఘన స్వాగతం పలికారు.తర్వాత జరిగిన ప్రజా వేదికలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు,నంద్యాల జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు.నంద్యాల ఎస్పీ సారథ్యంలో ఎస్పీలు డిఎస్పీలు ఎస్సైలు మరియు సిబ్బంది ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

About Author