దెందులూరు మండలంలో సీతంపేట రైతులకు తీరిన సాగునీటి కష్టాలు
1 min read

దెందులూరు గ్రామంవద్ద రూ. 77 లక్షల రూపాయలతో సైఫాన్ స్లూయిజ్ ప్రారంభం
సైఫన్ మరియు స్లూయిజ్లను ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
గోదావరి జలాలకు పసుపు కుంకుమ సమర్పించి జలహారతి అందించి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :దెందులూరు గ్రామం వద్ద రూ: 77 లక్షల నిధులు మంజూరు చేసి దెందులూరు మండలం సీతంపేట రైతులకు నీటి కష్టాలను తీర్చారు. గోదావరి జలాలకు పసుమ, కుంకుమ సమర్పించి నీటిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేది ప్రభాకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నామని, గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వంలో కనీసం కాలువలు, స్లూయిజ్లా మరమ్మత్తులు చేపట్టకపోవడంతో పాటు కనీసం ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా ఇవ్వకపోవడం వంటి అనేక వైఫల్యాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయటంతో పాటు గ్రామాల్లోని రైతులకు కూడా సాగు నీరు అందించడంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. అందులో భాగంగానే టైలెండ్ లో ఉన్న సీతంపేట గ్రామానికి అటు పోలవరం రైట్ మెన్ కెనాల్ నుంచి కొప్పుల వారి గూడెం అవుట్ లెట్ ద్వారా గోదావరి జలాలను అందించడంతోపాటు కృష్ణా జలాలు సైతం విడుదల చేసే విధంగా సైఫన్ను నిర్మించి తద్వారా స్లోయిజ్ ద్వారా నీటి విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టామని, ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి దెందులూరు నియోజకవర్గ రైతులు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు నియోజక వర్గకూటమి నాయకులు నీటి సంఘాల అధ్యక్షులు, జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.


