న్యాయం చేయాలంటూ మొబైల్ ఫోన్ విడిభాగాల వ్యాపారస్తులు ధర్నా
1 min read

తమపై భౌతిక దాడులు చేస్తున్న వారిని చట్టపరంగా శిక్షించాలి
జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేత
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరులో రాజస్థాన్ కు చెందిన మొబైల్ ఫోన్ విడిభాగాల షాపులపై ఏలూరు నగరానికి చెందిన మొబైల్ షాపుల యజమానులు, రాజస్థాన్ వర్కర్ ల పై ఏలూరు కు చెందిన కొంతమంది మొబైల్ షాపుల వ్యాపారులు చేస్తున్న దాడులను అరికట్టాలని మొబైల్ ఫోన్ విడిభాగాల షాపుల యజ మానులు శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు, మేము సుమారు 15 సంవత్సరాలగా ఏలూరు పట్టణమునందు మొబైల్ విడిభాగాల షాపులు అద్దెకి తీసుకొని అడ్వాన్సులు కట్టి ప్రతినెల అద్దె చెల్లిస్తూ స్టాప్ జీతాలు ఇస్తూ కరెంట్ బిల్లు కట్టుకుని ప్రభుత్వం జీఎస్టీ ని సక్రమంగా చెల్లిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన దాడులపై సెల్ ఫోన్ విడిభాగాల యజమానులుతమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు,అప్పట్లో ఇరు వర్గాలను కూర్చో బెట్టి ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునే విధంగా ఒప్పంద పత్రం వ్రాసుకుని సమన్వయం చేసుకున్నామని సెల్ ఫోన్ విడిభాగాల యజమానులు మీడియాకు తెలిపారు.ఐతే కొంత మంది వ్యక్తులు తమ షేపుల పై దాడుల పరంపర మళ్ళీ కొనసాగిస్తున్నారని, నోటికి వచ్చిన విధంగా దుర్భాషలాడుతూ ప్రాంతీయ వాదం తీసుకొస్తూ నానాయాగి సృష్టిస్తున్నారన్నారు. వీరు చేసిన ఆగడాలు భౌతిక దాడులు వీడియో,ఆడియో ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అన్నారు. దీని పై తమకు.తమ దగ్గర పనిచేసే వర్కర్ లకు రక్షణ కల్పించి, తమపై దాడులు చేస్తున్న వారిని చట్టపరంగా శిక్షించాలని అన్నారు. తమ వ్యాపారాలను సజావుగా చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సెల్ ఫోన్ విడి భాగాల షాపుల యజమానులు సుమారు 100 మంది ధర్నా చేశారు,అనంతరం జిల్లా కలెక్టర్ ను, జిల్లా ఎస్పీని ఆశ్రయించి వినతి పత్రం అందజేసినట్టు వ్యాపారులు తెలిపారు.

