NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అస్సాంలో అణగారిన వర్గాల ఇళ్ల తొలగింపులను వెంటనే ఆపాలి…

1 min read

అస్సాంలో జరుగుతున్న పేదలు అణగారిన మరియు మైనార్టీల ఇళ్ల తొలగింపును వెంటనే ఆపాలని ఎస్ డి పి ఐ డిమాండ్

హొళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండల ఎస్ డి పి ఐ పార్టీ కార్యాలయం నందు ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ వారి అధ్యక్షతన పాత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ డి పి ఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్  మాట్లాడుతూ అస్సాంలో జరుగుతున్న పేద మరియు ముస్లింల మరియు అణగారిన వర్గాల ఇళ్ల తొలగింపులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా  అస్సాం లో ఉన్న బిజెపి ప్రభుత్వం గోల్పారా జిల్లాలో పైకాన్ ప్రాంతంలో నిర్వహించిన దారుణమైన తొలగింపు చర్యలో దాదాపు 1,080 పైగా  కుటుంబాలు రోడ్డున పడ్డారు కుటుంబాలు దాదాపు 70 నుండి 80 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నారు అంతేకాకుండా వీళ్ళ దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్ ఉన్నప్పటికీ వీళ్ళ ఇళ్లను తొలగించడం చాలా బాధాకరం అని అన్నారు కూడా పర్యావరణ పునరుద్ధరణ ముసుగులో అమలు చేయబడిన అమానవియ చర్య  బిజెపి  నేతృత్వంలోని ప్రభుత్వం మానవ గౌరవం మరియు న్యాయం పట్ల ముఖ్యంగా అణగారిన  వర్గాల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది అని అన్నారు.అంతేకాకుండా ఈ తొలగింపు బహిష్కరణ కార్యక్రమంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అన్నారు.. ఈ దారుణమైన తొలగింపు చర్యలో నష్టపోయిన కుటుంబాలు న్యాయపోరాటం కోసం తన హక్కును వినియోగించుకోవడానికి ఈ తొలగింపు బహిష్కరణ చర్యను  వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నప్పుడు అక్కడున్న పోలీస్ సిబ్బంది జరిపిన కాల్పులలో కుతుబుద్దీన్ షేక్ మరణించడం జరిగింది.. ఈ కాల్పులలో అనేకమంది గాయపడడం జరిగింది. అమాయక ప్రజలపై జరుగుతున్న ఇళ్ల తొలగింపులను వెంటనే ఆపి ఈ తొలగింపు చేపడుతున్న వారిపై   వెంటనే చర్యలు తీసుకోవాలని అస్సాం ప్రభుత్వాన్ని సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ కార్యదర్శి హఫీజ్ కార్యవర్గ సభ్యులు ఫాజిల్. షఫీ బక్షి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author