పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం
1 min read

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఈనెల 21 నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రులు, సహచర ఎంపీలతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు కేంద్ర నుంచి రాబట్టేలా లోక్ సభలో ప్రస్తావించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగు సూచనలు చేశారని ఎంపీ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలు,వ్యూహాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధానంగా చర్చించినట్లు ఎంపీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రైల్వే, ఎన్.హెచ్, ఇతర సమస్యలను లోక్ సభలో ప్రస్తావించి, కేంద్రం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.


