తల్ సైనిక్ క్యాంపులో జి. పుల్లయ్య కళాశాల విద్యార్థి ప్రతిభ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఈనెల 7 నుండి 16వ తేదీ వరకు అనంతపూర్ లో జరిగిన ఇంటర్ గ్రూప్ తాల్ సైనిక్ పోటీలలో జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి బి.సుశాంత్, III ఈసీఈ. పాల్గొని, టెంట్ పిచ్చింగ్ మరియు అబ్స్టికల్ ట్రైనింగ్ లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి బంగారు పతకం సాధించాడు.ఈ సందర్భంగా రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ శ్రీ జీ.వీ.ఎం మోహన్ కుమార్ సుశాంత్ ని అభినందించారు. మోహన్ కుమార్ మాట్లాడుతూఎన్ సి సి వల్ల క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి మరియు సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందిస్తుందని అంతేకాకుండా, ఇది రక్షణ దళాలలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది, ప్రత్యేకించి రాత పరీక్షలో రాయితీలు మరియు బోనస్ మార్కులను అందిస్తుందని తెలియజేశారు. కళాశాలలో ఎన్ సిసి ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే విద్యార్థులు తమ ప్రతిభను చాటి ఇలా పథకాలు సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా రిపబ్లిక్ పెరేడ్లో కళాశాల తరపున పాల్గొన్న ధరణి కుమార్ కు ఎన్ సి సి కమాండర్ ఇటీవల అందజేసిన జ్ఞాపికను బహికరించి ఇరువురిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శ్రీనివాసరావు, డీన్ అడ్మిన్ డాక్టర్ ఎం గిరిధర్ కుమార్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ జీ శశికుమార్ మరియు ఏఎన్ఓ ఎన్ సి సి,అసిస్టెంట్ ప్రొఫెసర్ మధు పాల్గొన్నారు.


