రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..పరామర్శించిన ఎమ్మెల్యే
1 min read

అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన ప్రజలు
కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామానికి చెందిన కోలా సోమన్న(అలియాస్) ఆనందరావు(58) బైక్ అదుపు తప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ పి.తిరుపాలు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు శుక్రవారం సా 4 గంటలకు ఆనందరావు మరియు ఇదే గ్రామానికి చెందిన చాకలి రాము ఇద్దరూ కలిసి నందికొట్కూరులో పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా నేషనల్ హైవే రోడ్డు నాగలూటి దగ్గర బైకు అదుపుతప్పి కింద పడడంతో తలకు వెనుక భాగంలో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.మరో వ్యక్తి రాముకు గాయాలు కావడంతో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కొరకు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.మృతునికి భార్య మరియమ్మ,ముగ్గురు కూతుర్లు శాంతకుమారి,మెర్సీ, మునెమ్మ కుమారుడు ప్రవీణ్ ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య,మిడుతూరు మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,మిడుతూరు మండల జడ్పిటీసీ పర్వత యుగంధర్ రెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి,వీరారెడ్డి, జనార్దన్ రెడ్డి ఏపీటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు మృతదేహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.శనివారం సాయంత్రం గ్రామంలో అంతక్రియలు నిర్వహించారు.సోమన్నమృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు బంధువులు శోకసంద్రంలో ఉన్నారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


