బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒక్కరు మృతి …మరొకరికి గాయాలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ద్విచక్ర వాహనను గుత్తి డిపో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి మరొకరికి గాయాలు అయిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న భార్య పిల్లలు కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని భార్య ఎమి అండి ఇంటికి రాని లేవండి,పిల్లలు నాన్న పాలుకు నాన్న అని ఏడుస్తూ శోకసముద్రంలోకి మునిగిపోయారు. అక్కడ చుట్టుపక్కల చూస్తున్న వారంతా వారిని చూసి కంటతడి పెట్టారు.పోలీసుల వివరాల మేరకు గుత్తి డిపో ఆర్టీసీ బస్సు కర్నూల్ కి వెళుతుండగా ప్యాపిలి పట్టణంలోని శాంతి ఫోటో స్టూడియో ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. అందులో ప్యాపిలి పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై పట్టణంలో నుంచి జాతీయ రహదారి పైకి వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. పట్టణానికి చెందిన ప్రసాద్ 30 సంవత్సరాలు రోడ్డు ప్రమాదంలో అక్కడికి అక్కడికి మృతిచెందారు. మరో వ్యక్తి కాలు విరగడంతో మెరుగైన వైద్యం కోసం డోన్ కి తరలించారు. మృతి చెందిన ప్రసాద్ కు బాడీ ని పోస్ట్ మర్డర్ కోసం డోన్ నికి తరలించి అనంతరం బాడిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మృతి చెందిన ప్రసాద్ కు భార్య, కుమార్తె ,కుమారుడు ఉన్నారని తెలిపారు. ప్యాపిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పెట్టామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు పట్టణంలో అతివేగంగా వస్తున్నాయని, ఈ వేగాన్ని తగ్గించి పట్టణంలో వేగని తగ్గించాలి, లేకుంటే ఇలాంటి ప్రమాదాలు మరెన్నో చూడాల్సిన వస్తుంది. ఈ వేగం తగ్గాలంటే స్పీడ్ బ్రేకర్లు తప్పనిసరిగా వేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్యాపిలి పట్టణ ప్రజలు అధికారులను కోరారు.

