NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మా పాల‌న‌లో ప్రజ‌లు సంతోషంగా ఉన్నారు.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

1 min read

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం ర‌ణ‌స్థలం మండ‌లంలోని కోస్ట గ్రామంలో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్యక్రమం

ప్రజ‌ల‌ను క‌లిసి ఏడాదిలో చేసిన మంచి ప‌నులు వివరించిన మంత్రి టి.జి భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు: త‌మ ప్రభుత్వ ఏడాది పాల‌న‌లో రాష్ట్రంలోని ప్రజ‌లందరూ సంతోషంగా ఉన్నార‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం ర‌ణ‌స్థలం మండ‌లంలోని కోస్ట గ్రామంలో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే న‌డుకుడిది ఈశ్వర్ రావుతో క‌లిసి ఆయ‌న పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికీ తిరిగి ఏడాదిలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల‌ను వివ‌రించారు. మ‌హిళ‌లతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అనంత‌రం మంత్రి టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ త‌మ ప్రభుత్వంలో ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాల‌న సాగిస్తున్నామ‌న్నారు.  సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర‌కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేప‌ట్టి.. ఏడాదిలో చేసిన మంచిని వివ‌రిస్తున్నామ‌న్నారు. కోస్ట గ్రామంలో ప్రజ‌ల వ‌ద్దకు వెళుతుంటే ఘ‌నంగా స్వాగ‌తం చెబుతున్నార‌న్నారు. ప్రజ‌ల స్పంద‌న చూస్తుంటే త‌మ పాల‌న‌లో ఎంత హ్యాపీగాఉన్నారో స్పష్టంగా తెలుస్తోంద‌న్నారు. త‌మ ప్రభుత్వం ఏర్పడిన సంవ‌త్సరంలోనే అన్ని శాఖ‌ల్లో క‌లిపి రాష్ట్రానికి తొమ్మిదిన్నర ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని మంత్రి తెలిపారు. ఐదేళ్లలో భారీగా పెట్టుబ‌డులు వ‌స్తాయ‌న్నారు. త‌మ ప్రభుత్వం మ‌రో రెండు ద‌శాబ్దాల పాటు అధికారంలో ఉండాల‌న్నారు. అప్పుడే ఏపీ దేశంలోనే బెస్ట్ స్టేట్ అవుతుంద‌న్నారు. ప్రజ‌ల‌కు చేసిన మంచి చెప్పడ‌మే కాకుండా త‌మ‌ను ఆశీర్వదించాల‌ని కోరుతున్నట్లు ఆయ‌న చెప్పారు. ఎమ్మెల్యే నడికుడితి ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళుతుందన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత‌లు క‌లిశెట్టి సూర్యనారాయ‌ణ‌, లంక శ్యామలారావు, జగన్నాథం నాయుడు, నాలుగు మండలాల టిడిపి అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

About Author