ఘనంగా డిఈఎఫ్ వేడుకలు…
1 min read

దివ్యాంగులకు అండదండలు అంధించడమే మా ధ్యేయం.!
డిఈఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మల్లేల ఆల్ఫ్రెడ్ రాజు, సెక్రడ్ సంస్థ డైరెక్టర్ తిప్పన్న
పల్లెవాణి, న్యూస్ నేడు: మంగళవారం కర్నూలు పట్టణంలో “శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం” లో డిఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బి సి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర “దివ్యాంగుల సాధికారత ఫోరం” (డిఈఎఫ్) ఆవిర్భావ దినోత్సవ సభ కు ముఖ్య అతిథులుగా డిఈఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మల్లేల ఆల్ఫ్రెడ్ రాజు, సెక్రెడ్ సంస్థ డైరెక్టర్ తిప్పన్న, జిల్లా ప్రెస్ ఎపిడబ్ల్యుజే అధ్యక్షులు ఈ నాగరాజు గౌడ్, దివ్యాంగుల ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ క్రిష్ణుడు, టిడిపి దివ్యాంగుల విభాగం సెక్రటరీ నీలా జోజిబాబు తదితరులు హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారిక కోసం వారి యొక్క జీవిత వెలుగుల కోసం ఎప్పుడూ వెన్నంటి ఉంటామని తగిన సహాయ, సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో డిఈఎఫ్ అధ్యక్షులు బి సి నాగరాజు, ప్రధాన కార్యదర్శులు ఎం. శివశంకర్, కె ఈరన్న, ఉపాధ్యక్షులు కమతం వెంకటేశ్, కోశాధికారి ఆదిశేషయ్య, సలహాదారులు రామాంజనేయులు మాట్లాడుతూ కచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2016-వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని, ఈ 2016 చట్టాన్ని అమలు చేసినప్పుడే మా జీవితాలు వికసిస్తాయని పేర్కొన్నారు అలాగే మా దివ్యాంగులకు సంబంధించిన సామాజిక హక్కుల కోసం చట్టాల కోసం రాయితీ రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని ఆటు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు ఇటు దివ్యాంగులకు ఓ వారధిలా నిలుస్తుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామస్థాయి దగ్గర నుంచి మండల స్థాయి వరకు డిఈఎఫ్ ను బలపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల డిఈఎఫ్ కార్యవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

