ఉద్యోగావకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
1 min read

జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్
ప్యాపిలి/ నంద్యాల, న్యూస్ నేడు: స్థానిక ప్రాంత అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి మరియు ఉద్యోగావకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారి స్తోందని… ఆ మేరకు జిల్లాలో చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం ప్యాపిలి మండలం మాధవరం గ్రామంలో క్రషింగ్ మరియు పల్వరైజింగ్ యూనిట్ స్థాపన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) కు భూముల కేటాయింపునకు సంబంధించి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జేసి స్థల పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలో డోన్ ఆర్డీవో తో కలిసి జేసి ప్రత్యక్షంగా మాధవరం గ్రామాన్ని సందర్శించి, భూవివరాలు, స్థల స్థితి మరియు పరిశ్రమ స్థాపనకు అనుకూలత అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలలో అధికారులతో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు.అలాగే సదరు గ్రామంలో భూసంవర్గీకరణ మార్పులో భాగంగా మదింపు చేయని వ్యర్థాల భూముల నుంచి అంచనా వేయబడిన భూములుగా మార్చే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏపీఐఐసీకి కేటాయించడానికి సంబంధిత శాఖలకు నివేదికలు పంపడం జరిగిందన్నారు.ఈ చర్యల ద్వారా స్థానిక ప్రాంత అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి మరియు ఉద్యోగావకాశాల పెంపుకు దోహదం కలుగనుందని… వేగవంతంగా చర్యలు పూర్తి చేయాలని జేసి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డోన్ ఆర్డీవో, స్థానిక తహసిల్దార్, రెవిన్యూ, ఏపీఐఐసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

