రామసింగవరం ఫీడర్ లో ఆర్ డి ఎస్ఎస్ పథకంలో పనులు
1 min read
24వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు విద్యుత్ నిలుపుదల
వ్యవసాయ బోరు బావులకు విద్యుత్ అంతరాయం
వినియోగదారులు గమనించి సహకరించాలని మనవి
కె.ఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఆపరేషన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదవేగి మండలం, పెదవేగి సెక్షన్ పరిధిలో గల 132 కేవీ పెదవేగి నుండి వెళ్లే 33 కేవీ రామసింగవరం ఫీడర్ లో ఆర్డిఎస్ఎస్ పథకంలో పనులు నిమిత్తం ఈ నెల 24వ తేదీ గురువారం ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదలచేయబడునని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.ఎం. అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.కావున రామసింగవరం పరిధిలో గల వ్యవసాయ బోరు బావులుకు విద్యుత్ అంతరాయం కలుగునని, వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా ఆయన కోరారు.

