మా మండలానికి ఎరువులు పంపిణీ చేయండి…
1 min read

హొళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లా హోలగుంద మండలం లోని మండల కేంద్రం మరియు గ్రామాలకు సంబంధించిన రైతులకు ఇప్పటివరకు గ్రామ రైతు సేవ కేంద్రంలో ఒక బస్తా ఎరువులు కూడా పంపిణీ చేయలేదు. కావున వెంటనే మా మండలానికి ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకొని రైతు సేవా కేంద్రంలో పంపిణీ చేయవలసిందిగా మండల వ్యవసాయ అధికారి శ్రీ. లోక్ దల్ ఆనంద్ కి వినతి పత్రం అందజేసిన జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షులు బుజ్జమ్మ బావ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శేషప్ప , మాజీ సింగిల్ విండో చైర్మన్ వందవాగిలి మల్లికార్జున పాల్గొన్నారు.

