తడి… పొడిచెత్తపై జడ్పీ సీఈఓ అవగాహన..
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : గ్రామాల్లో తడిచెత్త పొడిచెత్త వేరు చేయుట గురించి గ్రామాల్లో ప్రజలకు కర్నూలు జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి (జడ్పీ సీఈవో) నారసరెడ్డి స్వయంగా వారితో మాట్లాడుతూ అవగాహన కల్పించారు.బుధవారం ఉదయం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు గ్రామంలో కర్నూలు వారు ఐవి ఆర్ఎస్ కాల్స్ లో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ విషయంలో అలగనూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి మహిళలతో మాట్లాడి ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త సేకరణ ప్రతిరోజు ఉదయం గ్రామ పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లు చెత్త బండి ద్వారా గ్రామంలో ఉన్న చెత్తను తొలగిస్తున్నారా లేదా అని గ్రామస్తులను సీఈఓ అడిగారు.ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని అన్నారు.గ్రామంలో డ్రైనేజీ సమస్య లేకుండా చూడాలని అదేవిధంగా వర్షాకాలం సీజన్ కాబట్టి శానిటేషన్ చేస్తూ ఉండాలని సీఈవో అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి. దశరథ రామయ్య,డిప్యూటీ ఎంపీడీవో సంజన్న పాల్గొన్నారు.

