దేవరగట్టు శ్రీ.మాళామల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వీరభద్రగౌడ్
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బడుగు బలహీన వర్గాల, పేదప్రజల ఆశాజ్యోతి .బి.వీరభద్రగౌడ్ , యువ నాయకులు గిరిమల్లేశ్ గౌడ్ పవిత్ర శ్రావణమాసం అమావాస్య సందర్భంగా మన ఆలూరు నియోజకవర్గంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన దేవరగట్టు శ్రీ.మాళా మల్లేశ్వర స్వామి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం పరమశివుడు “దివి నుండి భువికి దిగివచ్చి కూర్మా వతారంలో కొలువై నిలచి” భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు .. అలాగే ప్రతి సంవత్సరం పవిత్ర విజయ దసమి రోజున మన దేశంలోనే ప్రత్యేకమైన పూజా సాంప్రదాయంతో అశ్వసేనులై శ్రీ.మాళా మల్లేశ్వర స్వామి వారు అశేష భక్త జనసందోహం మధ్యన దేవరగట్టు పుర వీధుల్లో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం అత్యద్భుతం ఈకార్యక్రమంలో దేశం నలుమూలల నుండి స్వామివారి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. కావున ఇంతటి పవిత్ర పుణ్యక్షేత్రంలో బి.వీరభద్రగౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ ముందుగా “పవిత్ర శ్రావణమాస”శుభాకాంక్షలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు నియోజకవర్గ వివిధ గ్రామాల టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


