NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేషన్ బియ్యం తడిస్తే నేనేం చెయ్యాలి.?

1 min read

మిడుతూరు , న్యూస్​ నేడు : రేషన్ బియ్యం తడిస్తే నేనేమీ చేయాలి అంటూ లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం పట్ల ప్రజలు లారీ డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సివిల్ సప్లయ్ గోడౌన్ నుంచి నిత్యవసర సరఫరా లారీ బియ్యం లోడును మిడుతూరు మండలానికి తీసుకొని వస్తుండగా దారి మధ్యలో వర్షం మొదలైంది లారీ సంబంధిత అధికారులు గానీ డ్రైవర్ గానీ లారీలో ఉన్న బియ్యం సంచులు వర్షపు నీటికి తడవకుండా మిడుతూరు గ్రామంలోకి రావడంతో రేషన్ దుకాణాల వద్ద బియ్యం సంచులను దించడానికి వెళ్లగా బియ్యం సంచులు తడవకుండా సంచుల పైన పట్టా కప్పితే బియ్యం తడవకుండా ఉంటాయి కదా అని రేషన్ డీలర్లు లారీ డ్రైవర్ కు చెప్పగా వర్షానికి బియ్యం నానితే నేనేం చేయాలి.బియ్యం తింటే తినండి లేకపోతే పడేయండి అంటూ డ్రైవర్ నిర్లక్ష్యపు సమాధానంతో అతనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.

About Author