NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలు ఉచిత మెడికల్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోవాలి

1 min read

ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్

కర్నూలు, న్యూస్​ నేడు:  కిమ్స్ హాస్పిటల్,సిఐటియు ముజఫర్ నగర్ కమిటీ,,లయన్స్ క్లబ్ ఆఫ్ వెల్ సీన్ జోన్ ,సీనియర్ సిటీజన్ అసోసియేషన్, టి.నరసింహయ్య గ్రంధాలయం,టి.సి.లక్ష్మమ్మ కుట్టు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం గ్రంథాలయంలో  ఏర్పాటుచేశారు.కార్యక్రమానికి లయన్స్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రిటైర్డ్ విశ్వభారతి ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్, సిపిఎం న్యూసిటీ కార్నర్స్ వర్గ సభ్యులు కే సుధాకరప్ప ఆర్ నరసింహులు.సిఐటియు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి, గ్రంధాలయం అధ్యక్షులు కె.ప్రభాకర్, కేవిపిఎస్ నగర సహాయ కార్యదర్శి ఎం.సి.ఆనంద్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు,మాజీ డివైఎఫ్ ఐ గౌరవాధ్యక్షులు నాయకులు వి.విజయ్ కుమార్,ప్రజానాట్య మండలి వార్డ్ కార్యదర్శి సురేష్, స్థానిక సిఐటియు  నాయకులు వై.సుధాకర్, ఆరు జేమ్స్ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, అధ్యక్షతన జరిగిన వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్, కార్డియాలాజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్,కె. ప్రభాకర్,మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం వైద్యం పేద ప్రజలకు భారంగా మారిందని పేద ప్రజలకు ఎంతో కొంత సహాయం అందించాలని ఉద్దేశంతోనే ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని .ఎంతో మంది ప్రజలు వైద్యానికి ఖర్చులు భరించలేక ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.కావున ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలలో తక్కువ ఖర్చుతో చికిత్స తీసుకుని, ఆరోగ్యం పరిరక్షించుకోవాలని వారు తెలియచేశారు. పేద ప్రజలు నివసించే అయ్యప్ప నగర్ లాంటి ఏరియాల్లో ఈ వైద్య శిబిరం నిర్వహించడం అభినందించదగ్గ  విషయమని నిర్వాహకులను వారు అభినందించారు. సమస్యలు ఉన్నవారు తమ దగ్గరికి వస్తే వీలైనంత తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతామని వారు తెలియజేశారు.  అనంతరం సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకర్ ఆర్ నరసింహులు ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి నరసింహ గ్రంథాలయ అధ్యక్షులు అయిన కె ప్రభాకర్ మాట్లాడుతూ వైద్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో ధనార్జన ధ్యేయంగా కొన్ని హాస్పటల్లో వ్యవహరిస్తున్నాయని అలా కాక ప్రజలకు ఎంతో కొంత సేవాందించాలని హాస్పిటల్ వారు అన్ని ప్రాంతాల్లో ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు సహాయకారులుగా ఉంటున్నారని అలాగే ప్రముఖ కంటి వైద్యులు కూడా గతంలో ఆటో కార్మికులకు మరియు ఇతరులకు ఉచితంగా కంటి వైద్యాన్ని అందిస్తూ వందలాదిమందికి కంటి అద్దాలు ఉచితంగా సరఫరా చేశారని ఈ సమాజంలో అలాంటి డాక్టర్లు ఉండడం చాలా అరుదని వారన్నారు  కార్మిక వర్గం పేద ప్రజలు నివసించే ముజఫర్ నగర్ లో వైద్య శిబిరాన్ని నిర్వహించాలని అడిగిన వెంటనే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన కిమ్స్ యాజమాన్యానికి డాక్టర్లకు వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు.  ఈ వైద్య శిబిరంలో బిపి,షుగర్ ఈసీజీ 2d కో ఉచితంగా చేశారు.  ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై సుధాకర్ సురేష్ గ్రంథాలయ నిర్వహణకులు బషీర్ మియా,బాబు, రహిమాను రాజు లక్ష్మీనారాయణ, తదితరులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

About Author