NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ్యుటేషన్ విధానాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి

1 min read

నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు, న్యూస్​ నేడు:  శనివారం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఆటో మ్యుటేషన్ (యజమాని పేరు ఆన్లైన్లోనే మారడం) విధానాన్ని సచివాలయాల అడ్మిన్లు జాగ్రత్తగా నిర్వహించాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. శనివారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో మ్యుటేషన్ విధానంపై అడ్మిన్లతో సమావేశం నిర్వహించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ సేవల్లో పారదర్శకత పెంచేందుకు వీలుగా ఆగస్టు 1 నుండి ఆటో మ్యుటేషన్ ప్రక్రియను సరికొత్త విధానంలో అమలుల్లోకి తీసుకొస్తుందన్నారు. ఇందులో 4 రకాలుగా మ్యుటేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఇళ్ళులు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించుకున్న వెంటనే ఆన్లైన్ విధానంలో ఆటో మ్యుటేషన్ (ఆన్‌లైన్‌లో పేరుతో ఆస్తి బదలాయింపు) జరుగుతోందని, అదేవిధంగా ఆస్తి పన్ను విధింపునకు అడ్మిన్‌ల లాగిన్‌లకు దరఖాస్తులు వస్తాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, ఆర్‌ఓ జునైద్, ఆర్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

About Author