NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలికలకు..బాలురకు వేర్వేరు హైస్కూలు ఏర్పాటు చేయాలని వినతి

1 min read

జెడ్పిహెచ్ఎస్​ హైస్కూల్ బాలికలకు మరియు బలరులను వేర్వేరు హైస్కూల్ ఏర్పాటు మరియు ఉర్దూ మరియు కన్నడ హైస్కూల్ ను బై పరిగేషన్ చేసి వేరుగా హైస్కూల్ ను కొనసాగించాలని ఎఈఓ 2 కబీర్  ను వినతి పత్రం ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు

హొళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలంలో హొళగుంద జెడ్పిహెచ్ఎస్​ హైస్కూల్ నందు ఉర్డు మీడియంను బై ఫర్గేషన్ చేసి మాకు సపరేటుగా హైస్కూల్ కావాలని ఉర్దూ మీడియం విద్యార్థుల తల్లిదండ్రులు ఎఈఓ 2 కబీర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన అనంతరం విద్యార్థుల తల్లితండ్రులు ఎం ఈ ఓ 2 కబీర్ కు వివరిస్తూ  హొళగుంద గ్రామంలో జడ్పీ హెచ్ ఎస్ హైస్కూల్లో బాలికలు మరియు బలరుల కు వేర్వేరు స్కూలు ఏర్పాటు చేయవలసిందిగా ఉత్తర్వులు వచ్చినట్లు మాకు సమాచారం తెలిసినది సదరు  దరఖాస్తు జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్ హెడ్మాస్టర్ మీ దృష్టికి పంపడం జరిగిందని మాకు తెలిసిందన్నారు అదే హైస్కూల్లో ఒక భాగం ఉర్దూ మరియు కన్నడ స్కూల్ గా ఉన్నది హొళగుంద లో మొత్తం మూడు మీడియం హై స్కూల్ ఉన్న విషయం మీకు తెలిసిందే ఇంగ్లీష్ కన్నడ మరియు ఉర్దూ మీడియం లు ఉన్నాయిఇంగ్లీష్ మీడియం లను బాయ్స్ మరియు గర్ల్స్ వేరు చేసిన కానీ ఉర్దూ మీడియం లకు ఇది చాలా కష్టంగా మారుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉర్దూ మీడియం లకు ఉపాధ్యాయులు ముగ్గురు మాత్రమే ఉన్నారు ఇంకా మూడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి దయచేసి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తమరు ఉర్దూ మీడియం లను బై ఫర్గేషన్ చేసి కేవలం 6 నుండి 10 వ తరగతి వరకు ఉర్దూ మీడియం కో ఎడ్యుకేషన్ చేయాలని కోరుచున్నాము ఇవన్నీ చేయడానికి ఇక్కడ సిబ్బంది మరియు బిల్డింగ్ అన్ని సౌకర్యాలు అనుకూలంగా ఉన్నాయి. అంతే కాకుండా హొళగుంద మండల లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నది మరియు హొళగుంద మండలానికి చెందిన చుట్టుపక్కల గ్రామాలలో ఫీడింగ్ స్కూల్ గా ఉన్న హొళగుంద ప్రైమరీ ఉర్దూ స్కూల్లో 90 మంది విద్యార్థులు ఎల్లార్తి ఉర్దూ స్కూల్లో 60 మంది విద్యార్థులు మరియు ఇంగలదహాళ్ ప్రైమరీ ఉర్దూ స్కూల్లో 30 మంది పిల్లలు ప్రస్తుతం ఉర్దూ మీడియం లో చదువుతున్నారు. మా వినతి ఏమనగా ఇంత మంది పిల్లల భవిష్యత్తులో ఉన్నత చదువు కొరకు హొళగుంద హై స్కూల్ కు వస్తారు కావున మా పిల్లల చదువు కొరకు జడ్పీహెచ్ఎస్ ఉర్దూ స్కూల్ను బైపరిగేషన్ చేసి వేరుగా కో ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాము ఈ వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు  సమకూర్చి ఈ సమస్యను వెంటనే  పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రుల తరపున  హొళగుంద ఎం ఈ ఓ 2 కబీర్ మరియు ఇంచార్జ్ హెడ్మాస్టర్ యునుస్ ను విన్నపిస్తున్నాముఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈస. మరియు 4 వ వార్డు సభ్యులు అబ్దుల్ హమీద్ ఎస్​ఎస్​వి షబ్బీర్ . 8 వ వార్డ్ సభ్యుడు అబ్దుల్ రెహమాన్ ఉర్దూ స్కూల్ చైర్మన్ ఎం. ఇర్ఫాన్. ఉర్దూ స్కూల్ మాజీ చైర్మన్ బర్కత్ ఇర్ఫాన్ కొలిమి సలామ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author