NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2003 డియస్సి వారికి పాత పెన్షన్ అమలుకు సీఎం చొరవ తీసుకోవాలి.. ఆపస్

1 min read

తిరుపతి , న్యూస్​ నేడు:  2003 డియస్సి వారు  కేంద్ర ప్రభుత్వం పెన్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన 57 మెమో ప్రకారం పాత పెన్షన్కు  అన్ని విధాల అర్హులు అయినప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 20 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వారికి పాత పెన్షన్ అమలు చేయకపోవడం శోచనీయం అని, ఇప్పటికే తెలంగాణ లో కూడా ఇదే కేటగిరికి చెందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా సీపీఎస్ అమలు తేదీ సెప్టెంబర్ ఒకటి 2004 కన్నా ముందు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రభుత్వ పాలనాపరమైన కారణాలవల్ల ఆలస్యమై సిపిఎస్ లోకి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఇప్పటికే పోరుబాట పట్టడం జరిగిందని, న్యాయ పోరాటానికి కూడా సిద్ధం అయ్యారని, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రివర్యులు వెంటనే స్పందించి 2003 డియస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుకు అధికారులను ఆదేశించాలని, తగు ఉత్తర్వులు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్)  రాష్ట్ర అధ్యక్షులు శవన్నగారి బాలాజీ, ప్రధాన కార్యదర్శి జి వెంకట సత్యనారాయణ . సీహెచ్     శ్రావనకుమార్  ఈ కార్య క్రమంలో తది తరులు పాల్గొన్నారు.

About Author